Skip to main content

ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజంలో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (పీజీడీజే)– కోర్సు కాల వ్యవధి 12 నెలలు.
డిప్లొమా ఇన్‌ జర్నలిజం (డీజే)– కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు.
డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం (డీటీవీజే)– కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు.
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సీజే)– కోర్సు కాల వ్యవధి మూడు నెలలు.

విద్యార్హత: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం కోర్సుకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా కోర్సులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ప్రవేశ విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్‌ గాను, కరస్పాండెన్స్‌ (దూర విద్య) విధానంలోనూ చేయొచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినొచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో కళాశాల వెబ్‌సైట్‌ (www.apcj.in ) ద్వారా పేరు రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 14.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apcj.in

Photo Stories