ఐఐపీఎస్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు
2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించి ముంబైలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సైస్(ఐఐపీఎస్).. మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు - అర్హతలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 18, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://iipsindia.ac.in
కోర్సులు - అర్హతలు:
- మాస్టర్ ఆఫ్ ఆర్‌ట్స/మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పాపులేషన్ స్టడీస్ (ఎంఏ/ఎమ్మెస్సీ):
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బయో-స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీ(ఎంబీడీ):
అర్హత: కనీసం 55% మార్కులతో బయో-స్టాటిస్టిక్స్/ హెల్త్ స్టాటిస్టిక్స్/ మ్యాథమేటిక్స్/ స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో బీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
- మాస్టర్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్(ఎంపీఎస్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఎంఏ/ ఎమ్మెస్సీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ పాపులేషన్ స్టడీస్/బయో-స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీ(పీహెచ్‌డీ):
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ ఎమ్మెస్సీ, మాస్టర్స్ (పాపులేషన్ స్టడీస్), ఎంఫిల్(పాపులేషన్ స్టడీస్) ఉత్తీర్ణులవ్వాలి.
- పార్ట్-టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
- పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్):
అర్హత: పాపులేషన్ స్టడీస్/ సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 18, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://iipsindia.ac.in