Skip to main content

Andhra University Admissions: ఏయూలో బీబీఏ, ఎంబీఏ ప్రవేశాలు

Andhra University

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)కి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌.. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్‌ సపోర్టింగ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
బీబీఏ + ఎంబీఏ ప్రోగ్రామ్‌: ఇది ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. దీన్ని ఐఐఎం విశాఖపట్నంతో కలిసి మల్టిపుల్‌ ఎంట్రీ–ఎగ్జిట్‌ ఆప్షన్‌ విధానంలో నిర్వహిస్తోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 30. 
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
బీబీఏ(లాజిస్టిక్స్‌): ఇది మూడేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌. దీన్ని ఏఎస్‌డీసీ/లాజిస్టిక్స్‌ స్కిల్‌ కౌన్సిల్‌తో కలిసి నిర్వహిస్తోంది. 

మొత్తం సీట్ల సంఖ్య: 40. 
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
న్‌లైన్‌ ఎంబీఏ(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌): 

మొత్తం సీట్లు: 60. 
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, విజయనగర్‌ ప్యాలెస్, పెద్ద వాల్తేర్, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021

వెబ్‌సైట్‌: http://www.audoa.in/

చ‌ద‌వండి: Osmania University: ఓయూలో పార్ట్‌టైం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories