Skip to main content

CAT 2023 Notification: మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల్లో.. మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ అడిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది.
CAT 2023 Notification

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు: అహ్మదాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, బో«ద్‌ గయ, కోల్‌కతా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచిరాపల్లి, ఉదయపూర్, విశాఖపట్నం.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉన్నా అర్హులే). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: Common Admission Test

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం,చిత్తూరు,గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 155 నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌-1 వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రెహెన్షన్, సెక్షన్‌-2 డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్,సెక్షన్‌-3 క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆ­యా సంస్థలు గ్రూప్‌ డిస్కషన్,రిటెన్‌ ఎబిలి­టీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 13.09.2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 25.10.2023 నుంచి 26.11.2023 వరకు.
  • పరీక్ష తేది: 26.11.2023.
  • ఫలితాల ప్రకటన: 2024 జనవరి రెండో వారం


వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/
 

CAT 2023 notification: క్యాట్‌ 2023 వివరాలు.. మూడు విభాగాల్లో పరీక్ష

Last Date

Photo Stories