Skip to main content

NEET 2023: నీట్‌ పీజీ–2023, దరఖాస్తు విధానం..

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌).. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్ష నిర్వహిస్తోంది. దీనిద్వారా ఎండీ/ఎంఎస్‌/పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
NEET PG-2023

అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ/ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. 31.03.2023 నాటికి ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మా«ధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2023.

పరీక్ష తేది: 05.03.2023.

వెబ్‌సైట్‌: https://natboard.edu.in

Also read: Mahatma Jyotibapule AP RJC-CET-2022 : మహాత్మా జ్యోతిబాపూలే ఏపీఆర్‌జేసీ సెట్‌–2022

Last Date

Photo Stories