Skip to main content

NTA-PhD Entrance Test 2023: ఎన్‌టీఏ–పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2023

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష 2023 ప్రకటనను విడుదలచేసింది. ఈ పరీక్ష ద్వారా యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, బెనారస్‌ హిందూ యూనివర్శిటీ, బాబా భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లు పొందవచ్చు.
NTA-PhD Entrance Test 2023

విభాగాలు: కామర్స్, ఫైనాన్స్, ఆర్ట్‌ అండ్‌ కల్చర్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సైన్సెస్, ఇంటర్‌ డిసిప్లినరీ సైన్సెస్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: వయోపరిమితి నిబంధనలు లేవు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి విభాగంలో రీసెర్చ్‌ మెథడాలజీ, రెండో విభాగంలో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, వరంగల్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 09.09.2023 నుంచి 11.09.2023 వరకు

వెబ్‌సైట్‌: https://www.nta.ac.in/

Last Date

Photo Stories