ఆర్‌ఆర్‌బీ జేఈ సీబీటీ-2 పరీక్ష తేదీలు విడుదల
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: రైల్వే శాఖ జూనియర్ ఇంజినీర్ (JE), కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే సీబీటీ-2 (CBT-2) పరీక్ష తేదీలు విడుదల చేసింది. ఈ పరీక్ష ఏప్రిల్ 22, 2025న జరగనుందని అధికారికంగా ప్రకటించింది.

ఇటీవలే సీబీటీ-1 ఫలితాలు విడుదల కాగా, సీబీటీ-2 పరీక్షకు షార్ట్‌లిస్ట్ అయిన 20,792 మంది అభ్యర్థుల రోల్ నంబర్లు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో (RRB Official Website) అందుబాటులో ఉన్నాయి.
ఆర్‌ఆర్‌బీ జేఈ 2024 నోటిఫికేషన్ (CEL No: 03/2024) ద్వారా దేశవ్యాప్తంగా 7,951 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
- సీబీటీ-2 పరీక్ష తేదీ: ఏప్రిల్ 22, 2025
- అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు: ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో
- మొత్తం ఖాళీలు: 7,951 పోస్టులు
![]() ![]() |
![]() ![]() |
Published date : 29 Mar 2025 10:36AM
Tags
- RRB JE CBT-2 Exam Date 2025
- RRB Junior Engineer Exam Date
- RRB CBT-2 Exam Schedule 2025
- RRB Chemical Supervisor Exam Date
- RRB Depot Material Superintendent Exam
- RRB Chemical & Metallurgical Assistant Exam
- RRB JE 2025 Notification
- RRB CBT-2 Admit Card Download
- RRB Exam 2025 Latest Updates
- RRB Junior Engineer Recruitment 2025
- RRB Official Website Details
- RRB JE Exam Pattern and Syllabus