Skip to main content

RRB Jobs Notification 2025 : ఇండియ‌న్ రైల్వేలో 1036 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌... ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇండియ‌న్ రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
RRB 1036 Jobs Notification 2025

ఈ ఉద్యోగాల‌కు అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల‌కు 2025 జ‌న‌వ‌రి 1వ తేదీకి 18 ఏళ్లు నిండి ఉండాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్ట్‌, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

➤☛ APPSC Jobs Notifications 2025 : 5500 పోస్టులకు పైగా నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే..?

భ‌ర్తీ చేసే పోస్టులు ఇవే..
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 187, సైంటిఫిక్ సూపర్‌వైజర్ 03 , ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు 338, చీఫ్ లా అసిస్టెంట్ 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ 18, జూనియర్ ట్రాన్స్‌లేటర్ 130, లైబ్రేరియన్ 188, ప్రైమరీ రైల్వే టీచర్ 03, అసిస్టెంట్ టీచర్ 02, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌ 02, సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌: 03 , స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ 59, మ్యూజిక్‌ టీచర్‌ 10, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌ 07, ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3: 12 ఇలా మొత్తం 1036 పోస్టులు భర్తీ చేయనుంది.

Published date : 07 Jan 2025 01:05PM

Photo Stories