Skip to main content

RRB Exams 2024 Dates Changes : 41,500 రైల్వే జాబ్స్‌.. మారిన కొత్త ప‌రీక్ష తేదీలు ఇవే... హాల్‌టికెట్లు కూడా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 41,500 ఉద్యోగాల‌కు భారీగా నోటిఫికేష‌న్లు ఇచ్చిన విష‌యం తెల్సిందే.
RRB All Exams 2024 Changes

అయితే గతంలో ప్ర‌క‌టించిన‌  పరీక్ష తేదీల్లో తాజాగా ఆర్‌ఆర్‌బీ మార్పులు చేసింది. ఆర్‌పీఎఫ్‌ ఎస్సై, టెక్నీషియన్, జేఈ రాత పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చేశారు. 

అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) 25.11.2024 నుంచి 29.11.2024 వరకు మార్పు చేశారు. అలాగే ఆర్‌పీఎఫ్‌ ఎస్సై ప‌రీక్ష‌ను 02.12.2024 నుంచి 12.12.2024 వరకు మార్పు చేశారు. టెక్నీషియన్ ప‌రీక్ష‌ల‌ను 18.12.2024 నుంచి 29.12.2024 వరకు మార్పులు చేశారు. జూనియర్ ఇంజినీర్ ప‌రీక్ష‌ల‌ను      13.12.2024 నుంచి 17.12.2024 వరకు మార్పులు చేశారు.

ఎంపిక విధానం ఇలా...
అన్ని రైల్వే జోన్లలో 18799 అసిస్టెంట్ లోకో పైలట్; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై; 14298 టెక్నీషియన్‌; 7951 జూనియర్‌ ఇంజినీర్‌.. మొత్తంగా 41,500 ఖాళీల భర్తీకి ఈ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 

నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే..
ఈ RRB పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే జరుగనున్నాయి. పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Published date : 26 Oct 2024 06:08PM
PDF

Photo Stories