RRB NTPC 11558 Jobs Notification 2024 : ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 11558 ఉద్యోగాలకు నోటిఫికేషన్... దరఖాస్తు..ఎంపిక విధానం ఇలా...
ఈ మేరకు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ కోసం అధికారికంగా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఇండియన్ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11558 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ రైల్వే పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ, అలాగే పోస్ట్ ప్రకారం ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు. ఈ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
☛➤ AP Government Jobs Calendar 2024 : ఇకపై APPSC Exams అన్ని ఈ ప్రకారంగానే..! AP Job Calendar 2024 ఎప్పుడంటే..?
వయోపరిమతి :
గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న పోస్టులను దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. 12వ తరగతి అర్హత ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసే వారి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉండాలి.
☛➤ Indian Railways TC Jobs 2024 : యువతకు శుభవార్త.. రైల్వేలో 11,250 టికెట్ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్..! అర్హతలు..ఎంపిక విధానం ఇలా...!
దరఖాస్తు చివరి తేదీ ఇదే..
గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. 13 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ నుంచి 20 అక్టోబర్ 2024 వరకు ఉంటుంది. గ్రాడ్యుయేట్ (లెవెల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ ( లెవెల్ 2, 3) పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500, అందులో రూ.400 సీబీటీ పరీక్షకు హాజరైన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది. SC, ST, Ex-Serviceman, PwBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఫీజు రూ. 250/- ఉంటుంది.
పోస్టుల వివరాలు ఇవే..
గ్రాడ్యుయేట్ పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉండే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు ఉండే ఛాన్స్ ఉంది.
ఎంపిక విధానం ఇలా.. :
ఆన్‌లైన్ పరీక్ష స్టెజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్ పరీక్ష స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించిన వారికి ఆయా పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాసైన వారికి తర్వాత దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Tags
- rrb jobs
- RRB NTPC
- rrb ntpc jobs notification 2024
- rrb ntpc jobs notification 2024 released
- rrb ntpc 11558 jobs notification 2024 released
- rb ntpc 11558 jobs exam syllabus
- rb ntpc 11558 jobs exam books
- rrb ntpc 11558 jobs eligibility
- rrb ntpc 11558 jobs eligibility details in telugu
- rrb ntpc 11558 jobs exam syllabus 2024
- rrb ntpc 11558 jobs age limit
- rrb ntpc 11558 jobs age limit details in telugu
- rrb ntpc age limit for general
- rrb ntpc recruitment 2024
- rrb ntpc recruitment 2024 news telugu
- telugu news rrb ntpc recruitment 2024
- rrb ntpc exam pattern 2024
- rrb ntpc exam pattern 2024 in telugu
- rrb ntpc exam pattern 2024 telugu
- rrb ntpc 11558 jobs selection process
- rrb ntpc 11558 jobs selection process inn telugu
- telugu news rrb ntpc 11558 jobs selection process
- rrb ntpc 11558 job application
- rrb ntpc 11558 job application 2024
- rrb ntpc 11558 job application 2024 last date
- rrb ntpc 11558 job online apply
- rrb ntpc 11558 job online apply news telugu
- telugu news rrb ntpc 11558 job online apply
- Southern Railway Recruitment 2024
- Indian Railway Recruitment 2024
- West Central Railway Recruitment 2024
- Northern Railway Recruitment 2024
- central railway recruitment 2024
- SECR Railway Recruitment 2024
- rrb jobs 2024
- rrb jobs 2023
- rrb jobs success tips in telugu
- rrb latest jobs 2024
- RRBNTPCRecruitment2024
- IndianRailwaysJobs
- NTPCVacancies
- RRBNotification
- RailwayJobs
- NTPCRecruitment
- IndianRailwayVacancies
- RRB11558Posts
- InterDegreeCandidates
- RailwayJobOpening
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024