Skip to main content

Indian Railways 3445 Clerk jobs: ఇంటర్‌ అర్హతతో రైల్వేలో 3445 క్లర్క్‌, TC, టైపిస్ట్‌ ఉద్యోగాలు జీతం 21700

Indian Railway jobs
Indian Railway jobs

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ (Indian Railway) వరుసగా శుభవార్తలు చెబుతూనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (Railway Recruitment Board) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,445 ఖాళీలను భర్తీ చేస్తోంది.

Indian Army jobs news: Click Here

ఈ మేరకు వివిధ నాన్- టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌)లకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ (NTPC UG) కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్‌ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. వివిధ పోస్టులను అనుసరించి ఇంటర్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రారంభమై.. అక్టోబర్‌ 27వ తేదీన ముగుస్తుంది.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు ఇవే:

సికింద్రాబాద్‌తో పాటు అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: 3445
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు : 2,022
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : 361
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : 990
ట్రైన్స్ క్లర్క్ పోస్టులు : 72

ఇతర ముఖ్యమైన సమాచారం :

అర్హత: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు రూ.21,700.. ఇతర పోస్టులకు రూ.19,900 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: సెప్టెంబర్‌ 21, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 27, 2024

పరీక్ష విధానం:
ఫస్ట్‌ స్టేజ్‌ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ మొత్తం ప్రశ్నల సంఖ్య- 100, మొత్తం మార్కులు- 100. పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
సబ్జెక్టులు: జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), మ్యాథ్స్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు) ఉంటాయి.
సెకండ్‌ స్టేజ్‌ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం ప్రశ్నల సంఖ్య- 120, మొత్తం మార్కుల సంఖ్య- 120. పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
సబ్జెక్టులు: జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్‌(35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు) ఉంటాయి.

 

Published date : 26 Oct 2024 08:31PM
PDF

Photo Stories