Skip to main content

Hyderabad JNTUH Mega job fair 20000 Jobs: హైదరాబాద్ JNTUH ఆధ్వర్యంలో 20వేల ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా ..రాతపరీక్ష లేకుండా ఎంపిక

Hyderabad JNTUH Mega job fair   JNTUH Mega Job Fair 2025 announcement
Hyderabad JNTUH Mega job fair

సాక్షి, ఎడ్యుకేషన్‌: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో మెగా జాబ్ ఫెయిర్ – 2025 మార్చి 1న నిర్వహించబడుతోంది.

రేపు స్కూళ్లకు కాలేజీలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం: Click Here

నిపుణా & సేవా ఇంటర్నేషనల్ (Nipuna & SEWA International) సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి గోడపత్రికను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు, నిపుణా ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీమతి సుభద్రా రాణి మయారాం, ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ డైరెక్టర్ డా. ఏ. రజిని, డిప్యూటీ డైరెక్టర్ డా. జె. సురేష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ జాబ్ ఫెయిర్ విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్‌మెంట్ రంగాల్లో విశేష ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని” తెలిపారు.

అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఉద్యోగ రంగం మారుతున్న నేపథ్యంలో, నైపుణ్యాల అభివృద్ధి అవసరమైన అంశమని పేర్కొన్నారు.

Published date : 27 Feb 2025 08:40AM

Photo Stories