CUET PG 2023 Notification: సీయూఈటీ(పీజీ)-2023 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇదే..
కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎఫ్‌ఎ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ వొకేషన్, ఎంఎడ్, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంకాం తదితరాలు.
అర్హత: ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాయవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలిన వాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి.
చదవండి: GAT-B & BET 2023 Notification: బయోటెక్నాలజీలో పీజీ చేస్తారా.. పూర్తి వివరాలు ఇవే..
పరీక్ష విధానం: పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో (లాంగ్వేజŒ , సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎ 25, పార్ట్-బిలో 75 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-ఎలో జనరల్, పార్ట్-బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.04.2023
వెబ్‌సైట్: https://cuet.nta.nic.in/