Skip to main content

Admission in Triple IT Basara: ట్రిపుల్‌ఐటీ బాసరలో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

బాసర రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలచేసింది.
Integrated B.Tech Admission in Triple IT Basara

మొత్తం సీట్లు, వివరాలు: మొత్తం 1650 ఇంటిగ్రెటెడ్‌ బీటెక్‌(ఇంటర్‌+బీటెక్‌) సీట్లు భర్తీ కానున్నాయి. యూనివర్శిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద, మరో 150 అదనంగా భర్తీ చేస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.
అర్హత: ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్లు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్‌ కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే.. ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.06.2023.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in/

చ‌ద‌వండి: Admission in RGUKT-AP: ఏపీ ఆర్‌జీయూకేటీలో పీయూసీ, బీటెక్‌ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Last Date

Photo Stories