Admission in RGUKT-AP: ఏపీ ఆర్‌జీయూకేటీలో పీయూసీ, బీటెక్ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
ఏపీలో క్యాంపస్‌లు: ఆర్‌కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఓంగోలు క్యాంపస్.
మొత్తం సీట్లు, వివరాలు: మొత్తం నాలుగు క్యాంపస్‌లలో 4000 సీట్లు భర్తీ కానున్నాయి. ప్రతి క్యాంపస్‌కు 1000 సీట్లు కేటాయించారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 400 సీట్లు అదనంగా భర్తీ చేస్తారు.
మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు తెలంగాణ విద్యార్థులు కూడా పోటీపడతారు.
అర్హత: ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు.
ఎంపిక విధానం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం ఖరారు చేస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.06.2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rgukt.in/
చదవండి: TTWREIS Admission 2023: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాలు