Admissions in IIT Hyderabad: ఫ్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు.. స్కాలర్‌షిప్ నెలకు రూ.25,000
ఐఐటీ హైదరాబాద్ ఫ్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: 12 నెలలు
అర్హత: డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ గ్రాడ్యుయేట్లు /సైన్స్, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ కోర్సులో నాలుగు మాడ్యుల్స్ ఉంటాయి. అభ్యర్థులు ఏ మాడ్యుల్‌లో కోర్సు పూర్తి చేసినా సర్టిఫికేట్ అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 12నెలలు స్కాలర్‌షిప్ ఇస్తారు.
స్కాలర్‌షిప్: నెలకు రూ.25,000 ఇస్తారు. స్కాలర్‌షిప్‌తో పాటు 50 వరకు ప్రీ–ప్లేస్‌మెంట్ ఆఫర్‌లు,ఐఐటీహె చ్ 6జీ పరిశోధన ప్రాజెక్ట్‌లో 200 ఆర్–డీ ప్రాజెక్ట్ స్టాఫ్ పొజిషన్లు ఉంటాయి.
దరఖాస్తులకు చివరితేది: 10.07.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://fwc.iith.ac.in