Admissions in CIPET : సిపెట్‌లో డిప్లొమా కోర్సులు.. రాత పరీక్ష ఇలా..
భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్).. 2022 ఏడాదికి గాను పలు విభాగాల్లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సిపెట్ జేఈఈ 2022 ద్వారా అడ్మిషన్స్ కల్పిస్తుంది. ఆయా కోర్సులకు టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అందించే కోర్సులు ఇవే
డిప్లొమా–ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ): ఈ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు ఉంటుంది. మొత్తం 6 సెమిస్టర్లుగా కోర్సు నిర్వహిస్తారు. పదోతరగతి/ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
డిప్లొమా–ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ)
ఈ కోర్సును మూడేళ్ల కాలవ్యవధితో ఆరు సెమిస్టర్లుగా నిర్వహిస్తారు. పదోతరగతి /ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణత సాధించి దరఖాస్తు చేసుకోవాలి. చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
పోస్ట్ డిప్లొమా–ప్లాస్టిక్ మౌల్డ్ డిౖజైన్ విత్ క్యాడ్ /క్యామ్
ఈ కోర్సు కాలవ్యవధి ఏడాదిన్నర ఉంటుంది. మొత్తం మూడు సెమిస్టర్లుగా నిర్వహిస్తారు.
అర్హత : మెకానికల్ /ప్లాస్టిక్స్/పాలిమర్/టూల్ /ప్రొడక్షన్ /మెకట్రానిక్స్ /ఆటోమెబైల్/టూల్ అండ్ డై మేకింగ్/పెట్రోకెమికల్స్ /ఇండస్ట్రియల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా ఉతీర్ణత సాధించి ఉండాలి. చివరి పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురు చూసే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
పీజీ డిప్లొమా–ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ–పీపీటీ)
ఈ కోర్సు రెండేళ్ల కాలవ్యవధితో 4 సెమిస్టర్లుగా ఉంటుంది. సైన్స్ సబ్జెక్టులతో మూడేళ్ల ఫుల్‌టైం డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
- వయసు: పై అన్ని కోర్సుల దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక ప్రక్రియ
- ఆన్‌లైన్(సీబీటీ–కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష ఇలా
- ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. విభాగాల వారీగా గత అకడమిక్ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ , జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
- డిప్లొమా విద్యార్హత కలిగిన వారికి గత అకడమిక్ మూడేళ్ల కోర్సులు అయిన మెకానికల్/ప్లాస్టిక్స్/పాలిమర్/టూల్/ప్రొడక్షన్/మెకట్రానిక్స్/ఆటోమెబైల్/టూల్ అండ్ డై మేకింగ్/పెట్రోకెమికల్స్/ఇండస్ట్రియల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 05.06.2022
- సిపెట్ అడ్మిషన్ టెస్ట్: 19.06.2022
- కోర్సులు ప్రారంభం: 16.08.2022
- వెబ్‌సైట్: https://www.cipet.gov.in
చదవండి: JEE-Advanced 2022: జేఈఈ(అడ్వాన్స్‌డ్) 2022 ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..