CUET 2022: ఎన్‌టీఏ–సీయూఈటీ(యూజీ)–2022... కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)–సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)–యూజీ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు.
- పరీక్ష: సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)–యూజీ 2022
- అర్హత: ఇంటర్మీడియెట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం 10+2/ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది.
పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బీ ప్రశ్నలు సంబంధిత లాంగ్వేజ్‌ల నుంచి ఉంటాయి. ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్, లిటరరీ అప్టిట్యూడ్, వొకాబ్యులరీ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 2లో డొమైన్ సంబంధిత సబ్జెక్టులు ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ 10+2 సంబంధిత అంశాల నుంచి ఎంసీక్యూ తరహా ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ 3లో.. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ , లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.04.2022
దరఖాస్తులకు చివరి తేది: 30.04.2022
వెబ్‌సైట్: https://cuet.samarth.ac.in/, https://nta.ac.in