Skip to main content

PJTSAU: పీజేటీఎస్‌ఏయూ, బైపీసీ స్ట్రీమ్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఎస్‌ఏయూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్‌ఆర్‌టీవీయూ), సిద్దిపేట(ములుగు)లోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ(ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌లో వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి.
PJTSAU

కోర్సుల వివరాలు

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌(బీవీఎస్సీ) అండ్‌ యానిమల్‌ హస్బెండరీ(ఏహెచ్‌)
  • బీఎస్సీ(హానర్స్‌) అగ్రికల్చర్‌(రెగ్యులర్‌ అండ్‌ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌)
  • బీఎస్సీ(హానర్స్‌) హార్టికల్చర్‌(రెగ్యులర్‌ అండ్‌ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌)
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఎసీ)
  • బీఎస్సీ (హానర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌(రెగ్యులర్‌ అండ్‌ సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌)

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో(ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్‌) ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌– 2021 ర్యాంక్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించడానికి చివరి తేది: 27.09.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.09.2021

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in 

Last Date

Photo Stories