Posts at SVIMS University : స్విమ్స్ యూనివర్సిటీలో ఆడ్‌హాక్ బేసిస్ పద్ధతిలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
తిరుపతి తుడా: స్విమ్స్ యూనివర్సిటీలో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, ట్యూటర్స్ ఖాళీలకు సంబంధించి అడహక్ బేసిస్ పద్ధతిన మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్విమ్స్ రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్ల తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన స్విమ్స్ కమిటీ హాల్లో ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హతతో పాటు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని చెప్పారు. ఆసక్తిగలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని కోరారు.
ఇతర వివరాలకు స్విమ్స్ వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. మొత్తం 29 సీనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టుల్లో అనాటమీ – 2, బయో కెమిస్ట్రీ– 2, కమ్యూనిటీ మెడిసిన్–4, డెంటిస్ట్ –1, ఫోరెన్సిక్ మెడిసిన్– 4, మైక్రో బయాలజీ –4 పీడియాట్రిక్–2, పాథాలజీ–2, ఫార్మాకాలజీ –4, ఫిజియాలజీ–3, తో పాటు ట్యూటర్స్‌కు సంబంధించి అనాటమీ–2, కమ్యూనిటీ మెడిసిన్–1 ఫోరెనిక్స్ మెడిసిన్– 2, మైక్రో బయాలజీ –1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయని వివరించారు.
Tags
- SVIMS university
- job offers
- Job Interviews
- medical jobs
- Senior Resident Doctors
- Ad Hoc Basis posts
- July 10
- Walk in Interviews
- Medical posts at SVIMS University
- Interview at SVIMS Committee hall
- job recruitments 2024
- latest job news
- Job Opportunity
- jobs for medical students
- medical jobs interviews
- Education News
- Sakshi Education News