Helpline for Engineering Counselling : ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు నిర్వహించిన హెల్ప్‌లైన్ సెంటర్‌కు విశేష స్పందన!
తిరుపతి సిటీ: ఏపీ ఈఏఎమ్‌సెట్–2024 ఇంజినీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నేపథ్యంలో ఎస్వీయూలోని ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్‌కు విశేష స్పందన లభిస్తోంది. గత రెండు రోజులకుగా సుమారు 600 మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురైన సమస్యలను, సందేహాలను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నారు.
NEET UG Exam 2024 Updates : నీట్ యూజీ రద్దు చేయం.. కారణం ఇదే..
ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగా గురువారం సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల సర్టీఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతోంది. వర్సిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ డెస్క్‌లో మొదటి దశలో భాగంగా 2వేల మంది విద్యార్థుల సర్టీఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హెల్ప్‌లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సుమన్, తులసి తదితరులు విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
Sampoornata Abhiyan: ‘సంపూర్ణత అభియాన్’ను ప్రారంభించిన నీతి ఆయోగ్