Skip to main content

TSPSC Jobs Notification : తెలంగాణలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

TSPSC Jobs Notification

తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ పరిధిలోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో.. టౌన్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

చ‌ద‌వండి: TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 175
అర్హత: డిప్లొమా(డీసీఈ/ఎల్‌సీఈ/ఎల్‌ఏఏ) లేదా బీఆర్క్‌ లేదా బీఈ, బీటెక్‌(సివిల్‌) లేదా బీప్లానింగ్‌/బీటెక్‌(ప్లానింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18–44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష లేదా ఓఎంఆర్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పేపర్‌–2లో సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. రెండు పేపర్లకు కలిపి పరీక్షకు 300 నిమిషాల సమయం కేటాయిస్తారు.

TSPSC Practice Test

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ: 
ఈ పేపర్‌కు సంబంధించి కరెంట్‌ అఫైర్స్‌–ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. అలాగే అంతర్జాతీయ సంబంధాలు, సదస్సులు, జనరల్‌ సైన్స్‌; సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు, ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎకానమీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ, ఇండియా అండ్‌ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ పాలిటీ విత్‌ ఏ ఫోకస్‌ ఆన్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్‌ అండ్‌ లిటరేచర్‌ ఆఫ్‌ తెలంగాణ, పాలసీస్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్, హిస్టరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఇండియా విత్‌ ఆన్‌ ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్, హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంట్రప్రిటేషన్, బేసిక్‌ ఇంగ్లిష్‌(8వ తరగతి స్థాయి). పేపర్‌–2: ఈ పేపర్‌కు సంబంధించిన పరీక్ష సంబంధిత సబ్జెక్టును అనుసరించి నిర్వహిస్తారు. ఇది ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ స్థాయిలో ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 13, 2022
  • పరీక్ష తేదీ: జనవరి, 2023
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌ (హెచ్‌ఎండీఏ పరిధిలో)లో మాత్రమే
  • వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories