Skip to main content

Telangana High Court Recruitment 2023: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ ప్రాతిపదికన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Telangana High Court Field Assistant 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 77
జిల్లాల వారీగా ఖాళీలు: భద్రాద్రి కొత్తగూడెం-05, కోర్టు ఆఫ్‌ ద ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్, హైదరాబాద్‌-01, సిటీ సివిల్‌ కోర్టు, హైదరాబాద్‌-11, జోగులాంబ గద్వాల-03, జగిత్యాల-05, జయశంకర్‌ భూపాలపల్లి-04, కామారెడ్డి-02, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌-01, మంచిర్యాల-04, మేడ్చల్‌-మల్కాజగిరి-07, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు, హైదరాబాద్‌-01, ములుగు-01, నాగర్‌ కర్నూల్‌-03, నారాయణపేట-03, పెద్దపల్లి-02, రాజన్న సిరిసిల్ల-02, రంగారెడ్డి-10, సిద్ధిపేట-04, సూర్యాపేట-03, వికారాబాద్‌-02, వనపర్తి-01, యాదాద్రి భువనగిరి-02.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలను అందజేయాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సీబీటీ/ఓఎమ్మార్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ఓమ్మార్‌ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 60, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.  పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 11.01.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: మార్చి 2023

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/

చ‌ద‌వండి: Telangana District Court Recruitment 2023: 163 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories