DRDO Recruitment 2023: డీఆర్‌డీవో సైంటిస్ట్.. నెలకు లక్ష వేతనం
- సైంటిస్ట్–బి హోదాలో 181 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- బీటెక్, సైన్స్ పీజీ, గేట్ స్కోర్‌తో దరఖాస్తుకు అర్హత
మొత్తం పోస్టుల సంఖ్య: 181
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.. డీఆర్‌డీఓ. ఈ సంస్థ.. మొత్తం 181 సైంటిస్ట్–బి పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్–49 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్–44, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్–34, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–5, మెటీరియల్ ఇంజనీరింగ్ /మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్–10, ఫిజిక్స్–10, కెమిస్ట్రీ–5, కెమికల్ ఇంజనీరింగ్–13, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్–7, మ్యాథమెటిక్స్–2, సివిల్ ఇంజనీరింగ్–2.
అర్హత
- సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌తో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో సంబంధిత పేపర్‌లో స్కోర్ సాధించాలి.
- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 31 నాటికి సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
- వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు ఉండాలి.
గేట్ స్కోర్
అభ్యర్థులు సంబంధిత బీటెక్, పీజీ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు తాము దరఖాస్తు చేసుకునే విభాగానికి సంబంధించిన గేట్ సబ్జెక్ట్‌లో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆయా విభాగాలకు సంబంధించి.. గేట్ స్కోర్ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున(1:10 నిష్పత్తిలో) పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ ఇలా
ఇంటర్వ్యూలో అభ్యర్థులకు పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తిని, రక్షణ రంగంలో పరిణామాలపై అవగాహనను పరిశీలిస్తారు. సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల బృందం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. కాబట్టి అభ్యర్థులు దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి.
చదవండి: IITM Recruitment 2023: ఐఐటీఎం, పుణెలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
వెయిటేజీ విధానం
సైంటిస్ట్–బి పోస్ట్‌లకు సంబంధించి నియామకాలను ఖరారు చేసే క్రమంలో.. వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. గేట్ స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంతిమంగా ఈ రెండింటినీ క్రోడీకరించి తుది విజేతలను ప్రకటిస్తారు.
శిక్షణ
సైంటిస్ట్–బి హోదాలో నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా.. అయిదు నెలలపాటు శిక్షణనిస్తారు. పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో వీరిని ఆఫీసర్ ట్రైనీగా పిలుస్తారు. దీనినే ఇండక్షన్ ప్రోగ్రామ్‌గానూ వ్యవహరిస్తారు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. డీఆర్‌డీఓ సైంటిస్ట్–బిగా ఉజ్వల కెరీర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
రూ.లక్షకు పైగానే వేతనం
‘సైంటిస్ట్–బి’ హోదాతో.. గ్రూప్–ఎ టెక్నికల్ స్థాయిలో ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు..తమ పనితీరు, ప్రతిభ ఆధారంగా.. భవిష్యత్తులో డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ, చైర్మన్‌ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వీరికి తొలుత సైంటిస్ట్–సిగా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత సైంటిస్ట్– డి, ఈ, ఎఫ్, జి స్థాయిలకు చేరుకోవచ్చు. అనంతరం సైంటిస్ట్–హెచ్ హోదాతో ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్‌గా ఉన్నత స్థాయి అందుకోవచ్చు. ఈ హోదాలో చూపిన ప్రతిభ ఆధారంగా డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ఆ తర్వాత డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ, చైర్మన్ స్థాయి వరకు ఎదగొచ్చు. సైంటిస్ట్–బి కొలువులో చేరిన వారికి ప్రారంభంలోనే రూ.56,100–రూ.1,77, 500 వేతన శ్రేణిలో నెలకు రూ.లక్ష వేతనం లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి రానుంది.
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి వచ్చిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rac.gov.in/
చదవండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీఓలో 181 సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |