Skip to main content

Probationary Officer Posts in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 232 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న బీఈఎల్‌ యూనిట్లు/కార్యాలయాల్లో.. ప్రొబేషనరీ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
"BEL Probationary Accounts Officer Recruitment, Engineer Job Opening,Probationary Officer Posts in BEL,BEL Probationary Officer Vacancy Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 232
పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్‌-205, ప్రొబేషనరీ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌)-12, ప్రొబేషనరీ అకౌంట్స్‌ ఆఫీసర్‌-15.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌), ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ/పీజీ డిప్లొమా(హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌), సీఏ/సీఎంఏ ఫైనల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజనీర్‌కు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు.
బేసిక్‌ పే స్కేల్‌: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

చ‌ద‌వండి: Assistant Engineer Posts in TSGENCO: తెలంగాణ జెన్‌కోలో 339 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పోస్టింగ్‌ ప్రదేశం: బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.10.2023
పరీక్ష తేది: డిసెంబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: Telangana Govt Jobs: తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్‌ పోస్టులు.. రాతపరీక్ష తేదీ ఇదే..
 

Qualification GRADUATE
Last Date October 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories