Skip to main content

2500 ONGC Jobs 2023: ఈ అర్హతలున్నవారు అప్లై చేసుకోవచ్చు .. పూర్తి వివరాలు ఇవే..

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. దేశవ్యాప్తంగా ఓఎన్‌జీసీ సెక్టార్లలో వివిధ ట్రేడులు/విభాగాల్లో భర్తీ దరఖాస్తులు కోరుతోంది.
ONGC Apprentice Notification 2023,Career Opportunities, ONGC Job Applications

మొత్తం ఖాళీల సంఖ్య: 2500
సెక్టార్ల వారీగా ఖాళీలు: నార్తర్న్‌ సెక్టార్‌–159, ముంబై సెక్టార్‌–436, వెస్ట్రన్‌ సెక్టార్‌–732, ఈస్ట్రర్‌ సెక్టార్‌–593, సదరన్‌ సెక్టార్‌–378, సెంట్రల్‌ సెక్టార్‌–202.
అర్హత: పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడులు/విభాగాలు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, సివిల్‌ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ అసిస్టెంట్, ఫైర్‌ సేఫ్టీ టెక్నీషియన్, ఫిట్టర్, మెకానిక్, డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, స్టోర్‌ కీపర్, మెషినిస్ట్, సర్వేయర్‌ తదితరాలు.
వయసు: 20.09.2023 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000, ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.7000.

చదవండి: HPCL Recruitment 2023: 276 ఉద్యోగాలు.. రాత పరీక్ష విధానం ఇలా‌..

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

పనిచేయాల్సిన ప్రదేశం: డెహ్రాడూన్, మెహసానా, జోర్హాట్, నజీరా అండ్‌ శివసాగర్, సిల్చార్, చెన్నై, కాకినాడ, కరైకాల్, రాజమండ్రి, అగర్తల, కోల్‌కతా, ఢిల్లీ, జో«ద్‌పూర్, గోవా, హజీరా, ముంబై, ఉరాన్, అహ్మదాబాద్, అంకలేశ్వర్, బరోడా, బొకారో,కాంబే.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.09.2023
ఫలితాల వెల్లడి తేది: 05.10.2023

వెబ్‌సైట్‌: https://ongcindia.com/

చదవండి: 425 Diploma Trainee Posts: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో డిప్లొమా ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

Qualification 10TH
Last Date September 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories