Skip to main content

HPCL Recruitment 2023: 276 ఉద్యోగాలు.. రాత పరీక్ష విధానం ఇలా‌..

బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులు అర్హులు మహారత్న సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌).. 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజనీరింగ్, సీఏ, లా ఆఫీసర్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
hpcl notification 2023 and exam pattern and preparation tips ,,latest jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 276
మెకానికల్‌ ఇంజనీరింగ్‌-57, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌-16, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌-36, సివిల్‌ ఇంజనీర్‌-18, కెమికల్‌ ఇంజనీర్‌-43, సీనియర్‌ ఆఫీసర్‌-సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌-10, సీనియర్‌ ఆఫీసర్‌-ఎల్‌ఎన్‌జీ బిజినెస్‌-2, సీనియర్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌ -బయోఫ్యూయల్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌-1, సీనియర్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌-నాన్‌ ఫ్యూయల్‌ బిజినెస్‌-4, సీనియర్‌ ఆఫీసర్‌-ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ బిజినెస్‌-02, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌-ముంబయి రిఫైనరీ-2, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌-విశాఖ రిఫైనరీ-6, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్స్‌-9, చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌-16, లా ఆఫీసర్స్‌-05, లా ఆఫీసర్స్‌-హెచ్‌ఆర్‌-2, మెడికల్‌ ఆఫీసర్‌-4, జనరల్‌ మేనేజర్‌-1, వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మొత్తం 10 పోస్టులున్నాయి.

వయసు
పోస్టులను అనుసరించి వయోపరిమితి నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌ పోస్టులకు గరిష్ట వయసు 25 ఏళ్లు ఉండాలి. ఆఫీసర్‌ కేటగిరీ పోస్టులకు 26 నుంచి 29 ఏళ్లు, జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు, గరిష్ట వయసులో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)కి 3 ఏళ్లు సడలింపు లభిస్తుంది.

చ‌ద‌వండి: 425 Diploma Trainee Posts: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో డిప్లొమా ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం
పోస్టులను అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. లా ఆఫీసర్స్, హెచ్‌ఆర్‌ విభాగంలో లా ఆఫీసర్‌ పోస్టుల ఎంపికకు సంబంధించి మూట్‌ కోర్డ్‌ను నిర్వహిస్తారు.

రాత పరీక్ష విధానం

  • కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష రెండు పార్ట్‌లుగా ఉంటుంది. 
  • పార్ట్‌-1లో జనరల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ పొటెన్షియల్‌ టెస్ట్‌ (లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌) నుంచి 85 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
  • పార్ట్‌-2లో టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ఇంజనీరింగ్‌లో చదివిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులోనూ 85 ప్రశ్నలకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. రెండు పార్ట్‌లకు కలిపి పరీక్ష సమయం 150 నిమిషాలు.

చ‌ద‌వండి: HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 276 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ప్రిపరేషన్‌ ఇలా
ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందు పరీక్ష సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. సిలబస్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. గత ప్రశ్నపత్రాలను గమనించి దానికి అనుగుణంగా సన్నద్ధత ప్రారంభించాలి. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ సంబంధించి బ్యాంక్, రైల్వేల ప్రశ్నపత్రాలను కూడా సాధన చేయొచ్చు. మాక్‌ టెస్టులు, ప్రాక్టీస్‌ టెస్టులు రాయాలి. దీనివల్ల తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 18.09.2023
  • వెబ్‌సైట్‌: https://hindustanpetroleum.com/careers
Qualification GRADUATE
Last Date September 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories