Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 560 (మైనింగ్ ఇంజనీరింగ్-351, సివిల్ ఇంజనీరింగ్-172, జియాలజీ-37)
అర్హతలు
- మైనింగ్ ఇంజనీరింగ్: కనీసం 60 శాతం మార్కులతో మైనింగ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- సివిల్ ఇంజనీరింగ్: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- జియాలజీ: జియాలజీలో ఎమ్మెస్సీ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా అప్లయిడ్ జియాలజీ/జియోఫిజిక్స్ లేదా 60 శాతం మార్కులతో అప్లయిడ్ జియోఫిజిక్స్ విద్యార్హత ఉండాలి.
- వయసు: 31.08.2023 నాటికి 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. కోల్ ఇండియా నిబంధనల ప్రకారం-వయోపరిమతిలో సడలింపు లభిస్తుంది.
వేతనాలు
ఎంపికైన అభ్యర్థులు ఇ-2 గ్రేడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా వి«ధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి ఇ-2 గ్రేడ్‌కు అందించే పే స్కేల్ ప్రకారం-రూ.50,000-1,60,000 వేతనంగా చెల్లిస్తారు.
చదవండి: NCL Recruitment 2023: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1140 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక ప్రక్రియ
గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టింగ్
ఎంపికైన అభ్యర్థులు దేశంలోని కోల్‌ఫిల్డ్ ప్రాంతాల్లో ఎక్కడైనా విధులు నిర్వర్తించేందుకు సిద్దంగా ఉండాలి. మేనేజ్‌మెంట్ నిర్ణయం ప్రకారం-ఖాళీల లభ్యతను బట్టి మూడు పోస్టింగ్ చాయిస్ అప్షన్ కూడా ఇస్తారు. అభ్యర్థులు ఈ మూడింటిలో తమ ఎంపికను తెలియజేయాల్సి ఉంటుంది.
సర్వీస్ బాండ్
ఎంపికైన అభ్యర్థులు 60 నెలల పాటు సంస్థలోనే పనిచేస్తామనే హామీతో సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. రూ.3లక్షల విలువైన ఈ బాండ్ జాయినింగ్ సమయం నుంచి అమలులోకి వస్తుంది. ఇందుకోసం అభ్యర్థుల వేతనం నుంచి ప్రతి నెల రూ.5000 తీసుకుంటారు. 60 నెలల సమయం పూరై్తన తర్వాత వడ్డీ లేకుండా సంబంధిత మొత్తాన్ని చెల్లిస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.10.2023
- వెబ్‌సైట్: https://www.coalindia.in/
చదవండి: ECIL Hyderabad Recruitment 2023: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.31,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |