Skip to main content

Intelligence Bureau Recruitment 2022: 1671 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల... రాత పరీక్ష ఇలా..

దేశంలోని అత్యంత కీలక విభాగమైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 1,671 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. పదోతరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
intelligence bureau notification and exam pattern

మొత్తం పోస్టుల సంఖ్య: 1671
విభాగాలు: సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌-1521 పోస్టులు; మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌): 150 పోస్టులు. 
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి మెట్రిక్యులేషన్‌(పదోతరగతి) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర నివాస ధ్రువీకరణ  పత్రం కలిగి ఉండాలి. స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయసు: 25.11.2022 నాటికి ఎస్‌ఏ/ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 25ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనాలు: సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ.21,700-రూ.69,100 వేతనం పొందవచ్చు. ఎంటీఎస్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000-రూ.56,900వరకు వేతనంగా లభిస్తుంది. అంతే కాకుండా స్పెషల్‌ సెక్యూరిటీ అలవెన్స్‌ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ఎంపిక ఇలా: టైర్‌-1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), టైర్‌-2(ఆఫ్‌లైన్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌),టైర్‌-3 (ఇంటర్వ్యూ)ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష: సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్, ఎంటీఎస్‌ ఉద్యోగాలకు పరీక్ష ఒకటే ఉంటుంది. 
టైర్‌-1: ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, న్యూమరికల్‌ ఎబిలిటీ (అనలిటికల్‌/లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ స్టడీస్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు రుణాత్మక మార్కుగా ఉంటుంది.  
టైర్‌-2: ఆఫ్‌లైన్‌ విధానంలో 40 మార్కులకు గంట సమయంతో పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ రూపంలో ప్రశ్నలుంటాయి. ట్రాన్స్‌లేషన్, వాయిస్‌ వైస్‌ వెర్సాల నుంచి ప్రశ్నలుంటాయి. స్పోకెన్‌ ఎబిలిటీ నుంచి 10 మార్కులకు పరీక్ష ఉంటుంది(ఇది సెక్యూరిటీ అసిస్టెంట్‌ /ఎగ్జిక్యూటివ్‌ వారికి మాత్రమే). టైర్‌-2కి సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ అభ్యర్థులు 50కి 20  క్వాలిఫయింగ్‌ మార్కులు సాధించాలి. ఎంటీఎస్‌ అభ్యర్థులు 40కి 16 మార్కులు సాధించాలి.
టైర్‌-3: ఈ దశలో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 25.11.2022

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/

చ‌ద‌వండి: Intelligence Bureau Recruitment 2022: పదోతరగతి అర్హత‌తో 1671 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories