Skip to main content

BARC Recruitment 2022: పదో తరగతి అర్హత‌తో 89 గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు..

BARC Recruitment 2022 For 89 Group C Non Gazetted Posts

బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌)పరిధిలోని న్యూక్లియర్‌ రీసైకిల్‌ బోర్డుల్లో (కల్పక్కం, తారాపూర్, ముంబై).. గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్‌లు–06, డ్రైవర్‌లు(ఆర్డినరీ గ్రేడ్‌)–11, వర్క్‌ అసిస్టెంట్‌లు–72.

స్టెనోగ్రాఫర్‌లు:  
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. 
వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500+అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

డ్రైవర్లు(ఆర్డినరీ గ్రేడ్‌): 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు మోటార్‌ మెకానిజం తెలిసి ఉండాలి. లైట్‌ వెహికల్‌ అయితే మూడేళ్లు, హెవీ వెహికల్‌ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900+అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టెస్ట్, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

వర్క్‌ అసిస్టెంట్‌లు:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000+అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2022

వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in/

 

చ‌ద‌వండి: Apprentice Jobs: ఇండియన్‌ నేవీలో 338 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories