Skip to main content

AAI recruitment 2022: ఏఏఐ, సదరన్‌ రీజియన్‌లో 156 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

AAI Assistant Recruitment 2022

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో.. జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆం్ర«దప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 156
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌(ఫైర్‌సర్వీస్‌)ఎన్‌ఈ4-132, జూనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌)ఎన్‌ఈ4 -10, సీనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌)ఎన్‌ఈ6 -13, సీనియర్‌ అసిస్టెంట్‌(అధికారిక భాష)ఎన్‌ఈ6-01.
అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 25.08.2022 నాటికి 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.31,000 నుంచి రూ.92,000, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.36,000 నుంచి రూ.1,10,000 ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష), వైద్య, శారీరక దారుఢ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్‌ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేది: 01.09.2022
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: http://www.aai.aero/

చ‌ద‌వండి: FCI New Delhi Recruitment: 113 మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories