TS Medical Jobs 2023: ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీలు), ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు ఆధునిక సౌకర్యాలు సమకూర్చి కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దింది.
APSCHE: పీజీ సెట్స్ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఖరారు
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యేలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోంది. తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) సిబ్బందిని క్రమబద్ధీకరిస్తోంది. అన్ని పీహెచ్‌సీల్లో ఒకేలా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయడమే లక్ష్యంగా అన్ని చోట్ల, అన్ని విభాగాల సిబ్బంది ఉండేలా రేషనలైజేషన్‌కు శ్రీకారం చుట్టింది.
గతానికి భిన్నంగా క్రమబద్ధీకరణ
గతంలో ఒక్కో పీహెచ్‌సీలో ఒక్కో విధంగా సిబ్బంది ఉండేవారు. ఒక చోట ఆరుగురు ఉంటే, మరో చోట 15 నుంచి 16 మంది వరకు సిబ్బంది విధులు నిర్వహించేవారు. తక్కువ సిబ్బంది ఉన్న పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అరకొరగా అందేవి. అత్యవసర వేళ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఐపీహెచ్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) ప్రకారం ప్రస్తుత వైఎస్సార్ సీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బంది విధులు నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టింది. అన్ని విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.
Educating Schools: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావనకి కఠిన చర్యలు జారీ
ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టు, సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్‌టెక్నీషియన్, ఇద్దరు హెల్త్ సూపర్‌వైజర్లు (పురుషుడు, మహిళ), సీహెచ్‌ఓ లేదా ఎంపీహెచ్‌ఈఓ, హెల్త్ ఎడ్యుకేటర్, పీహెచ్‌ఎన్ లేదా ఎఫ్‌ఎన్‌ఓ లేదా ఎంఎన్‌ఓ, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్‌జీఎస్) ఒకరు ఉండేలా చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో 50 పీహెచ్‌సీలు, ఎన్టీఆర్ జిల్లాలో 23 పీహెచ్‌సీలు ఉన్నాయి. సిబ్బంది క్రమబద్ధీకరణ పూర్తయితో ఎన్టీఆర్ జిల్లాలో 322 మంది, కృష్ణా జిల్లాలో 700 మంది సిబ్బంది అందుబాటులోకి వస్తారు.
ప్రతి పీహెచ్‌సీలో సైనింగ్ బోర్డులు
రేషనలైజేషన్ చేసిన తర్వాత ప్రతి పీహెచ్‌సీకి కేటాయించిన 14 మంది సిబ్బంది వివరాలతో కూడిన సైనింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలని పీహెచ్‌సీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సిబ్బంది క్యాడర్, పేరుతో కూడిన వివరాలు బోర్డులో ఉంటాయి. ప్రతి పీహెచ్‌సీలో ఈ విధంగా కనిపించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పీహెచ్‌సీ వైద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.