Educating Schools: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావనకి కఠిన చర్యలు జారీ
సాక్షి ఎడ్యుకేషన్: పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర ఎలాంటి విద్యా సంస్థల్లోనైనా కుల, మత ప్రస్తావనలు తీసుకురావద్దని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బాలల అభ్యున్నతి దృష్ట్యా రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పాఠశాలల్లో కుల, మత ప్రస్తావనలు తెచ్చే ఉపాధ్యాయులు, సిబ్బందిపై కమిషన్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
300 Jobs in AP: వాక్-ఇన్ ద్వారా నియామకం... పోస్టుల వివరాలు!
పాఠశాలల్లో మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్నట్లు ఉపాధ్యాయులు, సిబ్బందిపై కమిషన్‌కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇటువంటి వాటిపై కమిషన్ తీవ్రంగానే పరిగణిస్తుందన్నారు. కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు నేతృత్వంలో ఇటువంటి వాటిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనట్లైతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు apscpcr 2018@gmail.comకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.