Skip to main content

Intelligence Officer: ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు... ప్రారంభ వేత‌నం 81 వేలు... ఇలా అప్లై చేసుకోండి

కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐబీలో 797 జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు
ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు

డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసి ఆసక్తికలిగిన అభ్యర్థులు జూన్‌ 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. అభ్య‌ర్థులు ఇప్ప‌టికీ ద‌ర‌ఖాస్తు చేసుకోకుంటే త‌ర్వ‌గా చేసేసుకోండి. 

ఖాళీల వివరాలు…

జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (జేఐవో) గ్రేడ్‌-2/ టెక్నికల్‌: 797 పోస్టులు (యూఆర్‌- 325, ఎస్సీ- 119, ఎస్టీ- 59, ఓబీసీ- 215, ఈడబ్ల్యూఎస్‌- 79)

South Central Railway Jobs: డిప్లొమా, డిగ్రీ అర్హ‌త‌తో రైల్వేలో ఉద్యోగాలు... రాత ప‌రీక్ష లేకుండానే నియామ‌కం... పూర్తి వివ‌రాలు ఇవే

IB

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ విద్యా సంస్థ నుంచి డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా బ్యాచిలర్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఫిజిక్స్/ మేథమెటిక్స్‌  సబ్జెక్టులుగా ఉండాలి). లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇలా ప్రిపేర‌వ్వండి...
జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (జేఐఓ) పోస్టుకు సంబంధించిన గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలు సమాధానాలతోపాటుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని సాధన చేస్తే సందేహాలు తొలగి, అవగాహన పెరుగుతుంది. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని సన్నద్ధతను మెరుగుపరుచుకోవచ్చు. 

 టైమ్ టేబుల్‌ వేసుకుని దాన్ని క్రమం తప్పకుండా పాటించాలి.

డిప్లొమా, డిగ్రీ లో చదివిన సబ్జెక్టుల నుంచి 75 శాతం ప్రశ్నలు వస్తాయి. అందువల్ల పాఠ్యాంశాలపె పట్టు సాధించాలి. రివిజ‌న్ చేసుకుంటూ ఉండాలి.

అభ్యర్థులను టైర్‌-1లో సాధించిన మార్కుల ఆధారంగానే స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు. కాబట్టి దీంట్లో కనీసార్హత మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి. 

IBPS RRB Notification 2023: డిగ్రీ అర్హ‌త‌తో... ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి

IB

పరీక్ష వ్యవధి 2 గంటలు కాబట్టి ఆ నిర్ణీత సమయంలోనే పాత ప్రశ్నపత్రాలను పూర్తిచేయాలి. 

వయో పరిమితి: 18 నుంచి 27 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు/ ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు ఉంది.

వేతనం: రూ.25,500 – రూ.81,100 (ఇతర అలవెన్సులు వేత‌నానికి అద‌నంగా ల‌భిస్తాయి)

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (100 మార్కులు), స్కిల్ టెస్ట్ (30 మార్కులు), ఇంటర్వ్యూ (20 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.500.

పరీక్షల కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-06-2023.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 27-06-2023.

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 19 Jun 2023 06:56PM

Photo Stories