Skip to main content

First Woman DG CISF: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్‌ నియమితులయ్యారు.
First Woman DG CISF   Neena Singh

రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన ఈమె 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రాను  ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ఈయన మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ అనీష్ దయాళ్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈయన చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(IB)కోసం పనిచేశారు. డిసెంబర్ 11న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దయాళ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. 

గుజరాత్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు.

Savitri Jindal: అపర కుబేరులను వెన‌క్కునెట్టిన మ‌హిళ‌.. సంపాదనలో అగ్రస్థానం.. ఆమె ఎవ‌రంటే..?

Published date : 29 Dec 2023 02:57PM

Photo Stories