Skip to main content

South Central Railway Jobs: డిప్లొమా, డిగ్రీ అర్హ‌త‌తో రైల్వేలో ఉద్యోగాలు... రాత ప‌రీక్ష లేకుండానే నియామ‌కం... పూర్తి వివ‌రాలు ఇవే

దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే… కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ఎలాంటి ప‌రీక్ష నిర్వ‌హించ‌రు.
South Central Railway
South Central Railway

అక‌డ‌మిక్ ఇయ‌ర్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. అర్హులైన అభ్య‌ర్థులు కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి... 

జూనియర్ టెక్నికల్ అసోసియేట్(వర్క్స్‌/ డ్రాయింగ్‌): 35 పోస్టులు

చ‌ద‌వండి: ఎలాంటి ప‌రీక్ష లేదు... జ‌స్ట్ ప‌దో త‌ర‌గ‌తి మార్కుల‌తోనే రైల్వేలో ఖాళీల భర్తీ

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్.

అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/ సీఎస్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు, అనుభవం ఉండాలి.

Railways

వయ‌సు: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజ‌ర్వేష‌న్ అభ్య‌ర్థుల‌కు స‌డ‌లింపు ఉంది.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.

మొత్తం 100 మార్కులు ఉంటాయి.
అక‌డ‌మిక్ విద్యార్హ‌త‌లో వ‌చ్చిన మార్కుల‌కు 55 శాతం
వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌కు 30 శాతం
ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌కు 15 శాతం మార్కులు కేటాయించారు. 

IBPS RRB Notification 2023: డిగ్రీ అర్హ‌త‌తో... ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి

Railways

జీతం : అభ్య‌ర్థుల జీతం విష‌యానికి వ‌స్తే నెల‌కు 25 వేల నుంచి 30 వేల మధ్య చెల్లిస్తారు. దీనికి అల‌వెన్సులు అద‌నం. అభ్య‌ర్థులు ప‌ని చేసే ప్ర‌దేశాన్ని బ‌ట్టి వేత‌నం, అల‌వెన్సుల్లో తేడా ఉంటుంది. 

దరఖాస్తు: అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తును ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను
సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్‌ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ నిలయం, ఎస్‌సీఆర్‌, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.

చ‌ద‌వండి: 7 ల‌క్ష‌ల‌ ప్యాకేజీతో టాటా స్టీల్‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023. సాయంత్రం 5 గంట‌ల లోపు పంపాలి.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 07 Jun 2023 03:05PM
PDF

Photo Stories