Skip to main content

Job Mela: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా

శనివారం దువ్వాడలోని ఓ కంపెనీలో జాబ్‌ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగానికి ఉండాల్సిన అర్హతలు, తదితర వివరాలను జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రకటించారు..
Job Fair Eligibility Criteria    Unemployed Youth  Job Mela under AP Skill Development Organization    AP Skill Development Institute

కంచరపాలెం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌–ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 16న దువ్వాడలోని సినర్జీస్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో జాబ్‌మేళా జరగనుంది. 10వ తరగతి, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, డిప్లమో, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మెట్రాలజీ, ఐటీఐలో ఫిట్టర్‌, టర్నర్‌, మెకానిస్ట్‌, డీజిల్‌ మెకానిక్‌, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు అర్హులు.

Response for Job Mela: జాబ్‌మేళాలో 428 మంది ఎంపిక

ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు 92925 53352కు సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికృష్ణ చైతన్య ఓ ప్రకటనలో సూచించారు.

Published date : 14 Mar 2024 05:50PM

Photo Stories