Job Mela: ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

సాక్షి ఎడ్యుకేషన్: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్‌లో ఈనెల 13వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారులు సిహెచ్ సుబ్బిరెడ్డి (క్లరికల్), కె.శాంతి(టెక్నికల్) తెలిపారు. హనీ గ్రూప్, ప్లిప్‌కార్ట్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, వరుణ్ మోటార్స్, హెటిరో ల్యాబ్స్, జయభేరి ఆటోమోటివ్స్, గేమ్స్ సాప్ట్, రక్షిత్ బిజినెస్ సర్వీసెస్, ఎంఏఎస్ మైరెన్ సర్వీసెస్, ఆస్ట్రోటెక్ స్టీల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో 416 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
రిలేషన్‌షిప్ మేనేజర్, సేల్స్ మేనేజర్, డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ ఆఫీసర్, టెలికాలర్స్, పోర్ట్ సర్వేయర్స్, మెషీన్ ఆపరేటర్స్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, బీ, డీ, ఎం ఫార్మసీలో ఉత్తీర్ణత పొందినవారు అర్హులని పేర్కొన్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.12,000 నుంచి రూ.28,000ల వరకు ఉంటుందన్నారు. కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్‌మేళాకు రావాలని కోరారు.