Skip to main content

SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 108 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కు చెందిన బొకారో స్టీల్‌ ప్లాంట్‌.. 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
 Vacant Positions at SAIL Bokaro Steel Plant  SAIL Recruitment 2024 Apply for 108 Executive and Non Executive Jobs   Online Application Submission for SAIL Bokaro Steel Plant Jobs

మొత్తం పోస్టులు 108
మొత్తం 108 పోస్టుల్లో సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, మెడికల్‌ ఆఫీసర్‌(ఓహెచ్‌ఎస్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌(సేఫ్టీ) మొదలైన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 27,వీటితోపా­టు 81నాన్‌ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఉద్యోగాలు బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో.. మరికొన్ని ఝార్ఖండ్‌ మైన్స్‌లో ఉన్నాయి. 

అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. డిస్టెన్స్‌/కరస్పాండెన్స్‌/క్యాంపస్‌ విధానంలో చదివన వారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
వయసు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు వయసు 28 ఏళ్లకు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు(ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్‌ వారికి సడలింపు ఉంటుంది. 

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 16.04.2024
దరఖాస్తులకు చివరి తేదీ: 07.05.2024
వెబ్‌సైట్‌: https://www.sail.co.in/

చదవండి: NHPC Recruitment 2024: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ లో 50 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 16 Apr 2024 04:56PM

Photo Stories