Indian Culinary Institute: ఐసీఐ కోర్సుల్లో ప్రవేశాలు.. యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు..!
నంద్యాల: ఐసీఐ (ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్)– తిరుపతిలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి సీహెచ్. సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత పాకశాస్త్ర సంస్థ (ఐసీఐ) తిరుపతిలో మాత్రమే ఉందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకులు కలినరీ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు.
Saraswati Samman 2023: కేరళ కవి ప్రభ వర్మకు సరస్వతి సమ్మాన్
తితిదే, ఐఆర్‌సీటీసీ, స్టార్ హోటళ్లు, పర్యాటక, తదితర శాఖ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులతో పాటు నూతనంగా బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఇంటర్మీడియెట్‌లో 50 శాతం ఉత్తీర్ణతతో ఈ కోర్సులో చేరవచ్చన్నారు. జిల్లా యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9985486271ను సంప్రదించాలని సూచించారు.
National Award: భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పి గోపాల్‌కు జాతీయ పురస్కారం