National Award: భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పి గోపాల్‌కు జాతీయ పురస్కారం
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో మార్చి 21వ తేదీ జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు.
ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు.
‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది.