Job at Israel: ఇజ్రాయిల్‌లో ఉద్యోగావకాశాలు
Sakshi Education
ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు జిల్లా రైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. దీని గురించి మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు..

నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధిసంస్థ అధికారి అబ్దుల్ ఖయ్యూం సోమవారం తెలిపారు. ప్లాస్టరింగ్, సిరామిక్, బిల్డింగ్ ఫ్రేమ్ వర్క్, ఐరన్ బిల్డింగ్ వంటి టెక్నాలజిస్‌పై ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
Job Offer: బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు
21 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఎనిమిది ఆపై తరగతులు చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. భవన నిర్మాణ రంగంలో మూడేళ్ల అనుభవం తప్పనిసరి అన్నారు. ఎంపికైన వారికి వసతి, వెళ్లేందుకు ప్రయాణ ఖర్చు, ట్యాక్స్ డిడెక్షన్ వంటి సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు 99888 53335, 93986 43930లో సంప్రదించాలన్నారు.
Published date : 10 Jan 2024 09:14AM