Skip to main content

Company Employees: హైబ్రిడ్‌ పని విధానానికి మారిన డెల్‌ కంపెనీ.. కారణం..?

కరోనా సమయంలో ప్రారంభమైన వర్క ఫ్రం హోం విధానంలో ఇప్పటికే చాలామంది పని చేస్తున్నారు. ​కొంతమంది కార్యాలయానికి వచ్చి పని చేసినప్పట్టికీ అందరూ రావడం లేదు. అందుకోసం, కంపెనీ ఉద్యోగులకు ఈ లేఖలను పంపింది..
Dell Company changed to Hybrid Working Method with strict rules

సాక్షి ఎడ్యుకేషన్‌: ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.

Free Training: పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ..

టెక్‌ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కోవిడ్‌ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్‌ పని విధానానికి మారాయి. తాజాగా, ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్‌ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి.

SBI PO Final Results Out: ఎస్‌బీఐ పీవో తుది ఫలితాలు విడుదల, ఇలా రిజల్ట్‌ చూసుకోండి..

తాజాగా డెల్‌ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్‌ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే, కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్‌ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్‌ డెల్‌ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్‌ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి.

Model School Admissions: మోడల్‌ స్కూల్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల వివరాలు..

కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్‌, రిమోట్‌ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్‌ పద్ధతిలో భాగంగా సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్‌ రోల్‌లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది.

Published date : 19 Mar 2024 05:26PM

Photo Stories