Model School Admissions: మోడల్ స్కూల్ ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల వివరాలు..
ఆళ్లగడ్డ: జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 ఏపీ మోడల్ స్కూళ్లలో 2024– 25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఇంటర్ మీడియెట్ వరకు ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఆంగ్ల మీడియంలో విద్యనభ్యసించవచ్చు.
ప్రస్తుతం ఇందులో చేరేందుకు పోటీ పెరగడంతో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. గతంలో ఏటా 6వ తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించేవారు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని 100 సీట్లకు పెంచడం జరిగింది.
దీంతో ప్రస్తుతం ఒక్కో పాఠశాలలో ఆరో తరగతిలో అదనంగా 20 మంది ప్రవేశాలు పొందే అవకాశం ఉండటంతో జిల్లాలోని 20 పాఠశాలల్లో 400 మంది విద్యార్థిని, విద్యార్థులకు అదనంగా అవకాశం లభిస్తోంది. www.cse.ap.gov.in లేక https//schooledu.ap.gov.in/AP&CBSE&School / 28213801805 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీలకు రూ. 150, ఎస్సీ, ఎస్టీలకు రూ. 75 గా పరీక్ష ఫీజు నిర్ణయించారు. ఓసీ, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు పొంది ఉండాలి. ఇందులో పొందిన మార్కులు రిజర్వేషన్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నప్రత్రం ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది.
Commerce Teachers: కామర్స్ అధ్యాపకులకు ఐదురోజుల పునఃశ్చరణ తరగతులు
ప్రవేశ పరీక్ష షెడ్యూల్
● జిల్లాలో ఏపీ మోడల్ స్కూళ్లు: 20
● ఆన్‌లైన్ దరఖాస్తు: ఈనెల 31వ తేదీ వరకు
● పరీక్ష తేదీ: ఏప్రిల్ 21
● పరీక్ష సమయం: ఉదయం 10 నుంచి 12 గంటల వరకు
● ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 27
● పాఠశాలల వారీగా ఎంపికై న వారి
జాబితా ప్రదర్శన : ఏప్రిల్ 29
● సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఏప్రిల్ 30
● తరగతుల నిర్వహణ: జూన్ 12