Commerce Teachers: కామర్స్ అధ్యాపకులకు ఐదురోజుల పునఃశ్చరణ తరగతులు
మధురానగర్: మారుతున్న కాలానుగుణంగా కామర్స్ అధ్యాపకులు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ సూచించారు. స్ధానిక మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకులకు ఐదురోజుల పునఃశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి.
Poster Launch: ఏప్రిల్ 1న 'ఎసెంట్రిక్స్ టెక్ ఫెస్ట్'
ఈ పునఃశ్చరణ తరగతులను వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది నోడల్ రిసోర్స్‌సెంటర్ల ద్వారా 500మంది కామర్స్ అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఢిల్లీలో శిక్షణ పొందిన 21మంది మాస్టర్ ట్రైనర్స్ ఆఫ్‌లైన్ సెషన్స్‌లో శిక్షణ ఇస్తున్నారని వివరించారు. అధ్యాపకులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో ఉపయోగించి ప్రతీ విద్యార్థి ఉపాధి పొందేలా చూడాలన్నారు.
Research Methodology: ‘రీసెర్చ్ మెథడాలజీ’తో ఉపయోగాలు
ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు అధ్యాపకులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కళాశాలలో విద్యాప్రమాణాలు మెరుగుపరిచి అత్యుత్తమ విద్యాబోధన అందించేందుకు అధ్యాపకులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని సూచించారు. ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, డాక్టర్ సీహెచ్ అప్పారావు, డాక్టర్ కె.నవీన, ఎస్.మోహనరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.