Skip to main content

Job Training: నేష‌న‌ల్ అప్రెంటిస్ మేళా నిర్వాహ‌ణ‌

ప‌లు జిల్లాలో వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఈ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఐటీఐ విద్యార్థులు కూడా హాజ‌రు కాగ‌ల‌రు అని వివ‌రించారు. ఈ ఉద్యోగ మేళా గురించి వివ‌రాల‌ను ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
national apprentice mela organising at some districts
national apprentice mela organising at some districts

సాక్షి ఎడ్యుకేష‌న్: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో గల ప్రముఖ కంపెనీల్లో వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఐటీఐలో ‘ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటిస్‌ మేళా’ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.పరమేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి జరిగే ఈ మేళాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల ప్రముఖ కంపెనీలలో సుమారు 120 ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ఐటీఐలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు ఒక జత ధ్రువపత్రాలతో హాజరవ్వాలన్నారు.

SI candidates events: SI అభ్యర్థులకు ఈవెంట్స్‌ తేదీలు ఇవే..

ఐటీఐ పాసైన అభ్యర్థులు అప్రెంటిస్‌ ఐబీఎం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. లేదా నేరుగా తమ కార్యాలయంలో అభ్యర్థి సర్టిఫికెట్లతో ఆరోజు మేళాకు హాజరు కావచ్చన్నారు. అప్రెంటిస్‌ మేళాకు హాజరయ్యే విద్యార్థులు హెచ్‌టీటీపీఎస్‌://డీజీటీ.జీవోవీ.ఇన్‌/ఏపీపీఎంఈల్‌ఏఏపీఆర్‌ఐఎల్‌22/లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. వివరాలకు 8919796259, 9603859666 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ పి.పరమేశ్వరరావు తెలిపారు.

Published date : 08 Sep 2023 04:59PM

Photo Stories