Skip to main content

Apprenticeship Mela: ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ అప్రెంటిస్‌ మేళా.. పూర్తి వివరాలు ఇవే..

Representatives of Leading Companies   Local government ITI college in Mogalrajapuram, NTR district   Opportunity for ITI Students

ఎన్టీఆర్ జిల్లా మొగల్రాజపురంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ ఉదయం 9 గంటలకు అప్రెంటిస్‌ మేళాను నిర్వహిస్తున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.కనకారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా కంపెనీల్లో అప్రెంటిస్‌ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో చదువుకున్న అన్ని ట్రేడ్‌లకు చెందిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చని వివరించారు. అభ్యర్థులు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటుగా ఒక సెట్‌ జిరాక్స్‌ పత్రాలు, పాస్‌పోర్ట్‌ ఫొటోతో విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగే అప్రెంటిస్‌ మేళాకు హాజరు కావాల్సిందిగా సూచించారు. ఇతర వివరాలకు 0866–2475575, 99480 29903, 83094 42698, 77804 29468 సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

Job Drive: ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ జాబ్‌ డ్రైవ్.. అర్హతలు ఇవే..

Published date : 08 Feb 2024 08:38AM

Photo Stories