Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

ఇటీవల మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. దేశ వ్యాప్తంగా న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. కొన్నింటికి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పీఎన్‌బీ పోస్టులకు ఫిబ్రవరి 25, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టులకు ఫిబ్రవరి 23వ తేదీ, ఐడీబీఐ ఉద్యోగాలకు ఫిబ్రవరి 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్.. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ఈ కింది లిక్స్‌ని క్లిక్ చేయండి..
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..
యూనియన్ బ్యాంక్‌లో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..
500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..