Skip to main content

PNB Recruitment 2024: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 1025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం.. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Punjab National Bank Head Office in New Delhi   Application Invitations for Specialist Officer Positions  PNB Recruitment 2024 For 1025 Specialist Officer Jobs   e: Specialist Officer Recruitment Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 1025
పోస్టుల వివరాలు: ఆఫీసర్‌–క్రెడిట్‌(జేఎంజీ స్కేల్‌1)–1000, మేనేజర్‌–ఫారెక్స్‌(ఎంఎంజీ స్కేల్‌2)–15, మేనేజర్‌–సైబర్‌ సెక్యూరిటీ(ఎంఎంజీ స్కేల్‌2)–05, సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ(ఎంఎంజీ స్కేల్‌3)–05.
అర్హత: ఖాళీలను అనుసరించి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2024 నాటికి ఆఫీసర్‌ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు, మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 35ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 27 నుంచి 38 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఆఫీసర్‌కు రూ.36,000 నుంచి రూ.63,840, మేనేజర్‌కు రూ.48,170 నుంచి రూ.69,810, సీనియర్‌ మేనేజర్‌కు రూ.63,840 నుంచి రూ.78,230.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: పార్ట్‌–1లో రీజనింగ్‌(25 ప్రశ్నలు–25 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(25 ప్రశ్నలు–25 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(50 ప్రశ్నలు–50 మార్కులు), పార్ట్‌–2లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌(50 ప్రశ్నలు–100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 07.02.2024
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 25.02.2024
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: మార్చి/ఏప్రిల్‌ 2024.

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/

చదవండి: Exam Preparation Tips: ఇలా చేస్తే.. సర్కారీ కొలువు సులువు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 08:02AM

Photo Stories