Job Mela For Freshers 2025: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే
Sakshi Education
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధికల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జనవరి 25న మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.ఓబులేషు తెలిపారు. గురువారం కళాశాల విడుదల చేసిన పత్రికా ప్రకటనలో...ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో ఫార్మసీ, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటాయన్నారు.
Job Mela For Freshers 2025
పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకుని 18 నుంచి 30 ఏళ్లు వయస్సుకలిగిన యువతీ యువకులు హాజరుకావచ్చన్నారు. జనవరి 25, ఉదయం 9.30 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. పూర్తి వివరాలకు 9553202509 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
ఎప్పుడు: జనవరి 25న ఎక్కడ: జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, మదనపల్లె